ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్(టీడబ్ల్యూయు), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) ఐక్య కూటమి విజయం సాధిస్తేనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీ నం, కార్మికుల సమస్యల పరిష్కారం, సంపూర్ణ ఉద్యోగ భద్రత సాధ్యమవుతుందని రెండు సంఘాల రాష్ట్ర నాయకులు కేఎస్.రెడ్డి, గడ్డం లింగమూర్తి తెలిపారు. ఖమ్మంలో జున్ను రవి, గుండు మాధవరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఐక్య కూటమి గెలుపు ఇప్పటికే ఖాయమైందని తెలిపారు. క్లాస్–3 గుర్తింపు కోసం తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌ను, క్లాస్–6 స్థానిక గుర్తింపు కోసం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌ను గెలిపించాలని కోరారు. ఈమేరకు 55 రోజుల సమ్మెలో కార్మికుల ప్రయోజనాల కోసం అశ్వద్ధామరెడ్డి చూపిన నిబద్ధతను గుర్తించాలని తెలిపా రు. కాగా, 29న ఖమ్మంలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వెల్ల డించారు. అనంతరం చైర్మన్‌గా గడ్డం లింగమూర్తి(ఎస్‌డబ్ల్యూఎఫ్), కన్వీనర్‌గా గుర్రం శ్రీనివాసరావు(టీడబ్ల్యూయు)తో పాటు 9మంది సభ్యులతో కూటమి సమన్వయ కమిటీని, 15 మందితో ప్రచార కమిటీ ఏర్పాటు చేశారు. నాయకులు పిట్టల సుధాకర్, అర్పినేని కృష్ణ, బాణాల రాంబాబు, చీధిరాల శ్రీనివాసరావు, గుర్రం ఉప్పలయ్య, మెరుగు రవీంద్రనాథ్, జె.పద్మావతి, డి.సరిత, గుగ్గిల రోశయ్య, ఎస్.ఎన్.చారి తదితరులు పాల్గొన్నారు.
ఐఎన్‌టీయూసీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి
ఆర్టీసీ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఐఎన్‌టీయూసీ – ఆర్టీసీ కార్మిక నేతల సమావేశంలో నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములుతో కలిసి ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం ఖమ్మం బస్ డిపో వద్ద జరిగే జెండా ఆవి ష్కరణ, ఆతర్వాత నిర్వహించే ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు నరేష్, హన్మంతరావు, వినోదరావు, ఉపేందర్ రెడ్డి, వీరభద్రరావు, యాదగిరి, శ్రీనివాస్, సురేష్ పాల్గొన్నారు.
టీడబ్ల్యూయూ,
ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు


