అమ్మతనాన్ని చాటిన ‘మాతృత్వం’ | - | Sakshi
Sakshi News home page

అమ్మతనాన్ని చాటిన ‘మాతృత్వం’

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన ‘మాతృత్వం’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. గుంటూరుకు చెందిన శ్రీరమణ కళానిలయం తరఫున సుఖమంచి కోటేశ్వరరావు రచించిన ఈ నాటికకు పొగర్తి నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. భార్యాభర్తల పాత్రధారులు సంతోష్‌, లావణ్యకు వివాహం జరిగి పదేళ్ల తర్వాత లావణ్య గర్భం దాలుస్తుంది. అయితే, భర్తతో విభేదాలు తలెత్తి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆపై అత్త ప్రమీల పక్షవాతానికి గురవగా, తాను రావాలంటే తల్లిని వదిలేయాలని షరతు పెట్టినా సంతోష్‌ తిరస్కరిస్తాడు. చివరకు లావణ్య జన్మనిచ్చిన బిడ్డ కోసం కూడా గొడవపడతారు. ఈక్రమాన తల్లీబిడ్డలను వేరు చేయడం తప్పని, మాతృత్వాన్ని గౌరవించాలని సందేశం ఇవ్వడంతో లావణ్య తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడంతో నాటిక సుఖాంతమవుతుంది. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ మాట్లాడుతూ నెలనెలా వెన్నె ల కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. తొలుత ఉపాధ్యాయులు చెరుకూరి వెంకటేశ్వరరా వు, జానకమ్మ చిత్రపటాల వద్ద నివాళులర్పించా రు. న్యాయవాది కాటమనేని రమేష్‌, ఉపాధ్యాయు డు ఆలస్యం వెంకటేశ్వరరావు, నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్‌, మోటమర్రి జగన్మోహన్‌రావు, దేవేంద్ర, డాక్టర్‌ నాగబత్తిని రవికుమార్‌, ఎం.తిరుమలాచార్యులు, నామా లక్ష్మీనారా యణ, వేముల సదానందం, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement