జలవనరుల శాఖ ఆన్‌లైన్‌లో... | - | Sakshi
Sakshi News home page

జలవనరుల శాఖ ఆన్‌లైన్‌లో...

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

● జిల్లాల వారీగా వివరాల డిజిటలైజేషన్‌ ● అధికారులు, ఉద్యోగులకు కొనసాగుతున్న శిక్షణ

● జిల్లాల వారీగా వివరాల డిజిటలైజేషన్‌ ● అధికారులు, ఉద్యోగులకు కొనసాగుతున్న శిక్షణ

ఖమ్మం అర్బన్‌: జలవనరుల శాఖ పరిపాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. జిల్లాల వారీగా ఉన్న జలవనరుల శాఖ సమాచారాన్ని డిజిటలైజ్‌ చేసి, ఈ–ఫైలింగ్‌ విధానంలో భద్రపరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా అధికారులు, ఉద్యోగులకు విడతల వారీగా హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

కీలక సమాచారం అంతా..

శాఖ పరిధిలోని రిజర్వాయర్ల పూర్తిస్థాయి నీటిమట్టం, నీటి నిల్వల వివరాలతోపాటు భూములు, కార్యాలయాలు, ప్రాజెక్టులు, భూసేకరణ సమాచారం, బిల్లుల చెల్లింపులు, ఇతర పరిపాలనా వివరాలను క్రమబద్ధీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇప్పటివరకు ఫైళ్లు, రికార్డుల రూపంలో ఉన్న సమాచారాన్ని డిజిటల్‌ రూపంలోకి మార్చడం ద్వారా అవసరమైన సమాచారం అన్ని స్థాయి అధికారులకు అందుబాటులోకి ఉంటుంది. అంతేకాక ఈ – ఫైలింగ్‌ విధానాన్ని విస్తృతంగా అమలు చేయడంతో ఫైళ్ల కదలిక, సమాచార సేకరణ, రికార్డుల నిర్వహణ సులభతరం కానుంది.

ఉమ్మడి జిల్లా నుంచి కూడా..

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శిక్షణకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు, ఇంజినీరింగ్‌ ఉద్యోగులు హాజరవుతున్నారు. గురువారం ఇంజినీర్లు వెళ్లగా, ఆన్‌లైన్‌ పోర్టల్‌ వినియోగం, డేటా ఎంట్రీ, ఈ–ఫైలింగ్‌ విధానం, డిజిటల్‌ రికార్డుల నిర్వహణపై మాస్టర్‌ ట్రెయినీలు శిక్షణ ఇస్తున్నారు. అక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు తమ పరిధిలోని ఉద్యోగులకు అవగాహన కల్పించాక జిల్లాలు, డివిజన్లు, సబ్‌ డివిజన్ల వారీగా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జలవనరుల శాఖలో పలు స్థాయి పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలనా భారం పెరుగుతోంది. ఈనేపథ్యాన సమాచారాన్ని డిజిటల్‌ రూపంలోకి మార్చడం పనులు సులువవుతాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement