‘సీతారామ’ సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

‘సీతారామ’ సమస్యలు పరిష్కరించండి

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. హైదరాబాద్‌లో ఉత్తమ్‌ను కలిసిన తుమ్మల మాట్లాడుతూ సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ ద్వారా బేతుపల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరిస్తే రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి ఉత్తమ్‌ భూసేకరణ సమస్యలను పరిష్కరించి, ప్యాకేజీ 9, 10ల్లో మిగిలిన పనులను వచ్చే నెలాఖరుకు పూర్తి చేసి కెనాల్‌ ద్వారా బేతుపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే 11, 12 ప్యాకేజీల పనులు కూడా వచ్చే ఏడాది మేలోగా పూర్తి చేయాలన్నారు. ఆతర్వాత అశ్వారావుపేట నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు 7, 8లో కాల్వలు కాకుండా పైప్‌లైన్లు ఏర్పాటుచేయాలని, జూలూరుపాడు టన్నెల్‌ పనులకు సంబంధించి 155 ఎకరాల భూసేకరణ సమస్య, కాల్వల పరిధి భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పంపుహౌస్‌లకు వినియోగించే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం జలవనరుల శాఖ సీఈ ఎస్‌.శ్రీనివాసరెడ్డి, నిర్మాణ కంపెనీల బాధ్యులు కేశవరాజు, సాయిబాబురాజు, సుమన్‌రావు, సంకినేని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

నీటిపారుదలశాఖ మంత్రి

ఉత్తమ్‌తో తుమ్మల భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement