రూ.1.26 లక్షలు పలికిన గణపతి లడ్డూ | - | Sakshi
Sakshi News home page

రూ.1.26 లక్షలు పలికిన గణపతి లడ్డూ

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

మధిర: మధిర మండలం వంగవీడులో నాయక్‌ యూత్‌ ఆధ్వర్యాన గణపతి మండపంలో లడ్డూ వేలం నిర్వహించారు. ఈసందర్భంగా బానోతు శ్రీను రూ.1,26,116కు లడ్డూ దక్కించుకున్నారు.

లడ్డూలు దక్కించుకున్న ముస్లిం దంపతులు

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లి శ్రీ ప్రసన్న ఆంజనేయ కమిటీ, హనుమాన్‌ యూత్‌ ఆధ్వర్యాన గణనాథుల చేతుల్లో లడ్డూలను వేలంలో ముస్లింలు దక్కించుకున్నారు. ఒక లడ్డూను రూ.20 వేలకు ఎస్‌కే.బాజీ – రజియా, మరో లడ్డూను రూ.16వేలకు ఎస్‌.కే. నాగూర్‌ పాడారు. కల్పతరు రోడ్డులోని గణేష్‌ లడ్డూను రూ.14,500కు జి.సాయం మణికంఠ, జవహర్‌నగర్‌ శ్రీకృష్ణ మందిరం వద్ద లడ్డూను ఈర్ల అశోక్‌ రూ.12 వేలకు, మరో లడ్డూను గుంజి చినమంగ రూ.పది వేలకు కై వసం చేసుకున్నారు. అంతేకాక శ్రీప్రసన్న గణపతి చారిటబుల్‌ ట్రస్ట్‌ గణనాథుడి లడ్డూను భక్తులతో కలిపి రూ.6,61,740కు మందపాటి కేశవరెడ్డి, అలవాల వెంకటరెడ్డి కైవసం చేసుకున్నారని నిర్వాహకులు కూసంపూడి శ్రీనివాసరావు తెలిపారు. జేవీఆర్‌ పార్క్‌ ఎదురుగా మహాగణపతి పీఠంలోని 54 కేజీల లడ్డూను రూ.1.45లక్షలకు ఆకుల జగదీష్‌ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement