ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు 31వరకే గడువు | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు 31వరకే గడువు

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

నేలకొండపల్లి: రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే ప్రభుత్వ రాయితీలు నిలిచిపోతాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎరువుల విక్రయాలు, పండించిన పంటల సేకరణ కు ఈ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో 77,862 మంది రైతులకు గాను ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదని, ఈనెల 31వరకే గడువు ఉన్నందున ముందుకు రావాలని సూచించారు. లేనిపక్షంలో రాయితీలు ఆగిపోతాయ ని చెప్పారు. కాగా, జిల్లావ్యాప్తంగా 378 గ్రామాల్లో డిజిటల్‌ సర్వే 50 శాతం పూర్తయిందని, మరో 15 రోజుల్లో పూర్తి చేస్తామని తెలపారు. సర్వే విషయమై రైతులకు మెసేజ్‌ వస్తుందని, తప్పులు ఉంటే 72 గంటలలో సరిదిద్దుతారని పేర్కొన్నారు. కాగా, జిల్లాలో గత ఏడాది 32,405 మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగిస్తే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 39,618 మె.టన్నులు పంపిణీ చేశామని డీఏఓ తెలిపారు. వర్షాల నేపథ్యాన పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఓ రాధ, ఏఈఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement