జిల్లావ్యాప్తంగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లావ్యాప్తంగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

2 మెగావాట్ల ప్లాంట్‌ను అనుసంధానం చేసిన ఎస్‌ఈ

ఎర్రుపాలెం: జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్ల సమీపాన ప్రభుత్వ భూములు సేకరించి సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో పీఎం కుసుమ్‌ పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను వెంకటాపురం సబ్‌స్టేషన్‌కు గురువారం అనుసంధానం చేశారు. గతంలోనే ఒక మెగా వాట్‌ను అనుసంధానించగా, ప్రస్తుత విద్యుత్‌తో కలిపి మొత్తం మూడు మెగావాట్లు విజయవంతంగా అనుసంధానం(సింక్రనైజేషన్‌) చేసినట్లు తెలిపారు. ఈ ప్లాంట్లతో నిర్వాహకులైన ఐకేపీ సభ్యులకు 25ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. పీఎం కుసుం పథకం కింద జిల్లా వ్యాప్తంగా 55 సౌర విద్యుత్‌ ప్లాంట్ల నుంచి 93.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించగా, ఇప్పటివరకు ఎనిమిది ప్లాంట్ల ద్వారా 11 మెగా వాట్ల సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. ఇవికాక తిరుమలాయపాలెం, పెద్దగోపతి, తల్లాడ సబ్‌ స్టేషన్‌లో సంస్థ స్వయంగా ఒక్కో మెగావాట్‌ ప్లాంట్ల పనులు చేపట్టిందని తెలిపారు. డీఈలు బండి శ్రీనివాసరావు, కిరణ్‌చక్రవర్తి, ఏఈడీ అనురాధ, ఏడీఈ రామకృష్ణ, ఏఈలు జి.అనూష, సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement