ఖమ్మంలో వినాయకుల శోభాయాత్రకు వర్షం అడ్డంకిగా మారింది. జిల్లా కేంద్రంలోని రేవతి సెంటర్‌లో గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటుచేయగా.. వర్షం కారణంగా
బుధ, గురువారాల్లో నిమజ్జనం కోసం తీసుకెళ్లడం వీలు కాలేదు. దీంతో నిర్వాహకులు అగ్నిమాపక శాఖ సిబ్బందితో మాట్లాడగా... ప్రతిష్ఠించిన చోటే గురువారం ఫైరింజన్ నీటితో నిమజ్జనం పూర్తిచేశారు. అంతకు ముందు నిర్వహించిన లడ్డూ వేలంలో
భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్


