ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
పాల్వంచలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బొగ్గు సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడిందని ఆరోపించారు. నాణ్యత లేని బొగ్గు సరఫరా చేస్తుండటంతో ఉత్పత్తి సగానికి సగం పడిపోయిందని అన్నారు. మణుగూరులో పువ్వాడ అజయ్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల నుంచి సింగరేణి బకాయి రూ. 52 వేల కోట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 8 గంటల విద్యుత్ కూడా అందించలేకపోతోందని విమర్శించారు.


