రూ.25.41 కోట్లతో
ఖమ్మం స్టేషన్ అభివృద్ధి
చివరకు చేరిన సుందరీకరణ పనులు
ఖమ్మం రాపర్తినగర్: ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేలా ‘అమృత్ భారత్’ పథకం ద్వారా ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రూ.25.41 కోట్లతో చేపడుతున్న పనులు చకచకా జరుగుతున్నాయి. కాజీపేట – విజయవాడ మార్గంలో ఉన్న కీలకమైన ఖమ్మం స్టేషన్ నుంచి నిత్యం 20వేల మందికిపైగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తారు. ఇక్కడ 55 రైళ్లకు హాల్టింగ్ ఉండడంతో న్యూఢిల్లీ, హౌరా, చైన్నె, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లేవారు ఖమ్మంను ఎంచుకుంటారు. ఈక్రమాన రెండేళ్ల క్రితమే మొదలైన ఆధునికీకరణ పనుల్లో భాగంగా పాదచారుల వంతెన, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫారాలు, విశ్రాంతి గది, ఏసీ లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్టేషన్ నూతన భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.


