సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని శ్రీ ప్రసన్న గణపతి క్షేత్రం మహా గణనాథుడి చేతిలోని 24 కేజీల లడ్డూకు బుధవారం వేలం నిర్వహించారు. స్థానిక రింగ్ సెంటర్‌లో జరిగిన వేలంలో నారాయణపురానికి చెందిన మందపాటి కేశవరెడ్డి, అలవాల వెంకటరెడ్డి పోటీ పడగా చివరకు రూ.6,56,646తో కేశవరెడ్డి దక్కించుకున్నారు. ప్రసన్న గణపతి ట్రస్ట్ నిర్వాహకులు కూసంపూడి శ్రీనివాసరావు, వడ్లపట్ల ఫణికుమార్, బోనగిరి కృష్ణారావు, శ్రీను, రామ్మోహన్, రాజు, నాగేశ్వరరావు, దారా ఏకాదశమూర్తి, రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే, గంగారంలో 111 కేజీల లడ్డూను మల్లిమొగ్గల సాయినాథ్ రూ.1.40లక్షలకు, రైతు బజార్ వద్ద గణపతి లడ్డూను రూ.20వేలకు రావి రంగారావు దక్కించుకున్నారు.
రూ.60,500కు లడ్డూ దక్కించుకున్న ముస్లిం నేత


