రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

Sep 23 2026 12:49 AM | Updated on Sep 23 2026 12:49 AM

ఖమ్మం సహకారనగర్‌: రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం ఖమ్మంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాయికోటి రాజు, ధరావత్‌ మోహన్‌ నాయక్‌ హాజరయ్యారు. ఈమేరకు జిల్లా నూతన అధ్యక్షుడిగా దొండా దర్గయ్య(కొణిజర్ల), ప్రధాన కార్యదర్శిగా సయ్యద్‌ రఫీ(ఖమ్మం)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, గౌరవ అధ్యక్షుడిగా యల్లంపల్లి యాదగిరి(ఖమ్మం రూరల్‌), వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా షేక్‌ జానీమియా, కోశాధికారిగా గుమ్మడవెల్లి సంతోష్‌కుమార్‌, గౌరవ సలహాదారుగా రంగారావుతో పాటు మరో 34మందిని ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. వివిధ మండలాల డీలర్లు శ్రీనివాసరావు, సాయికుమార్‌, గోళ్ల మురళి, ఖాజామియా, జానీమియా, గాజుల భద్రయ్య, తోట వెంకన్న, లగ్గిశెట్టి వెంకటేశ్వర్లు, సత్తార్‌మియా తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా

దర్గయ్య, రఫీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement