కొత్త చట్టాలపై పూర్తి అవగాహన | - | Sakshi
Sakshi News home page

కొత్త చట్టాలపై పూర్తి అవగాహన

Sep 12 2026 12:06 AM | Updated on Sep 12 2026 12:06 AM

ఖమ్మంక్రైం: పోలీసు శాఖలోని ప్రతీ ఉద్యోగి క్రిమినల్‌ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. అంతేకాక చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. కొత్త క్రిమినల్‌ చట్టాలపై సిటీ ఆర్ముడ్‌ రిజర్వ్‌ పోలీసు అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు గత వారం రోజులుగా సీటీసీలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ సంహిత(బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలోని ముఖ్య నిబంధణలు, కేసుల నమోదు, దర్యాప్తు విధానం, సాక్ష్యాల సేకరణ, డిజిటల్‌ సాక్ష్యాల ప్రాధాన్యత, బాధితుల హక్కులపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం శిక్షణను పరిశీలించిన సీపీ మాట్లాడుతూ కొత్త చట్టాల ప్రకారం కేసుల దర్యాప్తు మరింత శాసీ్త్రయంగా, సమర్థంవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో సీటీసీ ఏసీపీ హరిఽనాధ్‌బాబు, ఆర్‌ఐ నాగుల్‌ మీరా తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలు

వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సునీల్‌దత్‌ సూచించారు. శాంతి కమిటీలతో శుక్రవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఘటనలు జరగకుండా, మత సామరస్యాన్ని కాపాడుతూ అన్నివర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వివిధ శాఖల సమన్వయంతో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తుండగా, పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈక్రమాన విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సమయాన వివాదాలకు తావు లేకుండా నిర్వాహకులు బాధ్యయుతంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు మోహన్‌బాబు, బాలకృష్ణ, భానుప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement