వేంసూరు: విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో నీరు అందించలేని పరిస్థితి ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయని జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యాన రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో శుక్రవారం ‘రైతుల వరిగోస’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో సత్తుపల్లి ఏడీఈ ప్రసాద్‌బాబు, వేంసూరు ఏఈ అంకారావు శుక్రవారం వేంసూరు కందుకూరు సబ్ స్టేషన్‌ను పరిశీలించారు. సబ్ స్టేషన్ నుంచి రోజువారీగా సరఫరా అవుతున్న విద్యుత్ వివరాలే కాక ఎప్పుడెప్పుడు అవాంతరాలు వచ్చాయన్న వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. పంటలు ఎండకుండా విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు.


