అసంపూర్తి పనులతో రాకపోకలకు ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

అసంపూర్తి పనులతో రాకపోకలకు ఇక్కట్లు

Sep 12 2026 12:06 AM | Updated on Sep 12 2026 12:06 AM

నేలకొండపల్లి: మండలంలోని కోనాయిగూడెం – ఆరెగూడెం మధ్య నందిగామ బ్రాంచి కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతుండగా, కాల్వలో నుంచి రాకపోకలకు ప్రత్యేకంగా రహదారి ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం తాగునీటి సౌకర్యం కోసం కాల్వలో వేసిన మట్టి రహదారిని తొలగించారు. ఇదే సమయాన ప్రత్యామ్నయ చూపకపోవడంతో కోనాయిగూడెం, ఆరెగూడెం, ఆచార్లగూడెం గ్రామాల చెందిన ప్రజలు, రైతులు అవస్థ పడుతున్నారు. బ్రిడ్జి పూర్తికా, ప్రత్యామ్నాయ రహదారి లేక మూడు కి.మీ. చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా, బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని కాంగ్రెస్‌ నాయకులు మేకల వెంకటేశ్వర్లు, ఆనం వెంకటరెడ్డి, చెరుకుపల్లి రాజేష్‌, వడ్లమూడి వెంకటేశ్వర్లు, మేకల ఆర్జున్‌, కర్ల ఆశోక్‌, బోయిన కొండలు, వుల్లోజి రాకేష్‌, కొత్తపల్లి నవీన్‌ శుక్రవారం పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement