ఖమ్మం వైరారోడ్: ఉమ్మడి జిల్లాలో పంటలకు సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా జరగగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన సాగునీరు, విద్యుత్ అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇకనైనా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి అత్యవసరంగా సాగునీరు, సరిపడా విద్యుత్ అందించి రైతులను ఆదుకోవాలని పువ్వాడ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
తెలుగు విభాగంలో
పీహెచ్‌డీ
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంకు చెందిన పెద్దపల్లి తేజస్వి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఖమ్మం పంపింగ్‌వెల్ రోడ్‌కు చెందిన పెద్దపల్లి యాకయ్య – సావిత్రి దంపతుల కుమార్తె తేజస్వి ఓయూ తెలుగు విభాగంలో డాక్టర్ నాళేశ్వరం శంకరం పర్యవేక్షణలో ‘తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం–సీ్త్ర జీవన చిత్రణ (1991–2015)’ అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ సాధించిన ఆమెను పలువురు అభినందించారు.
గెస్ట్ ఫ్యాకల్టీ మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. జాబితా ల్లో అభ్యర్థుల పేరు, విద్యార్హతలు, మెరిట్, ఇతర వివరాల్లో తప్పులు, అభ్యంతరాలు ఉంటే తగిన ధ్రువపత్రాలతో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు భద్రాచలంలోని ఆర్‌సీఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వివరాలకు 85001 36628 నంబర్‌లో సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రామాల్లో వసతుల
కల్పనపై ప్రత్యేక దృష్టి
కామేపల్లి: గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వినోద్‌కుమార్ సూచించారు. మండలంలోని కొమ్మినేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో తాగునీటి సరఫరా, డ్రెయినేజీలు, రహదారుల నిర్మాణమే కాక మొక్కల పెంపకం, వైకుంఠధామాలు, రైతు వేదికలు నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. అంతేకాక రికార్డుల్లో వివరాలు నమోదు చేస్తూ పారదర్శకత పాటించేలా సర్పంచ్‌లు, కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎంపీఓ వీ.వీ.శాసీ్త్ర, కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు.
క్రమశిక్షణతో
విద్యార్థులకు విజయం
మధిర: విద్యార్థులు క్రమశిక్షణతో చదివేతేనే ఉన్నత స్థాయికి చేరి జీవితంలొ విజయం సాధించొచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు తెలిపారు. మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ జి.శంకర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి సహకారం, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకుల కృషితో కాలేజీలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ ఏడాది పుస్తకాలు, నోట్‌బుక్కులే కాక అల్పాహారం సమకూరుస్తున్నందున విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూడాలని, సెల్‌ఫోన్ వినియోగం తగ్గిస్తే చదువులో రాణించవచ్చని చెప్పారు. అనంతరం విద్యార్థులు ఇచ్చినసాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పూర్వ విద్యార్థులు వనమా సూరి, విప్లవకుమార్, బెజవాడ రవిబాబు, కౌన్సిలర్ బానోతు వెంకటరమణనా యక్, కాంగ్రెస్ నాయకుడు సూరంశెట్టి కిషోర్, అధ్యాపకులు పాల్గొన్నారు.


