కారేపల్లి: విధినిర్వహణలో భాగంగా తనిఖీలకు వెళ్లి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తాకి మృతి చెందిన ఫారెస్టు బీట్ ఆఫీసర్ బానోతు నవీన్‌కుమార్ కుటుంబానికి ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం ప్రకటించింది. ఈమేరకు అటవీ అమరవీరుల దినో త్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, డీజీపీ సీ.వీ.ఆనంద్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ తదితరులు నవీన్ సతీ మణి ప్రమీలకు చెక్కు అందజేశారు. కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బానోతు దేవ్లానాయక్ – సర్పంచ్ బూలి కుమారుడైన నవీన్ భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారం బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. గతనెల 11న నకిరిపేట అటవీ ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన సమయాన మృత్యువాత పడిన విషయం విదితమే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కారేపల్లి మండలానికి చెందిన రాజేందర్, అడ్డగోడ ఐలయ్య యాదవ్, అడపాపుల్లారావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో చెక్కు అందజేసిన
మంత్రి జూపల్లి


