కూసుమంచి: వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడమే కాక లోఓల్టేజీ సమస్యను పరిష్కరించి పంటలను కాపాడాలని సీపీఎం, తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కూసుమంచిలోని విద్యుత్ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి డీఈఈ సీహెచ్.నాగేశ్వరరావు, ఏడీఏ వెంకట్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, నాయకుడు మల్లెల సన్మతరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా కనీసం 8గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తున్న నేపథ్యాన ఇకనైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం, రైతు సంఘం నాయకులు యడవల్లి రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్, శీలం గురుమూర్తి, కర్ణబాబు, గన్యా నాయక్, జవ్వాజి శీను, సోమనబోయిన కృష్ణయ్య, ఊడుగు వెంకన్న, ఎర్రబోయిన సురేష్, ఎస్.కే బాబు, బాసు నాయక్, గుగులోత్ నాగేశ్వరరావు, వై.రంగయ్య, వెన్ను ఉపేందర్, మాధవరావు, సురేష్ ఉపేందర్, ప్రసాద్, పాల్గొన్నారు.


