ఖమ్మంగాంధీచౌక్: వారానికి ఐదు రోజుల పని దినాలు అమలుచేయాలనే డిమాండ్‌తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మె నిర్వహించారు. ఖమ్మంలోని వైరారోడ్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ 11 ఏళ్లుగా కోరుతున్న ఐదు రోజుల పనిదినాలు అమలు చేయడమే కాక ప్రభుత్వ ప్రత్యేక వివక్షాత్మక పీఎల్‌ఐ స్కీంను ఉపసంహరించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూఎఫ్‌బీయూ నాయకులు ఎస్.కే.ఇబ్రహీం, టి.రాజేష్, కె.రాంబాబు, శ్రీకాంత్, ఆర్.శివకుమార్, జి.వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎస్‌ఎన్‌ఎల్, టీయూసీఐ ప్రతినిధులు కల్యాణం వెంకటేశ్వరరావు, సింగు నర్సింహారావు, సీతా మహాలక్ష్మీ, తిరుమలాచారి, సీహెచ్.పుల్లయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.
ఒక రోజు సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు


