ఖమ్మంమయూరిసెంటర్: అర్హత కలిగిన ప్రతీ పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అందేలా గ్రామ పేదరిక నిర్మూలనా ప్రణాళిక ద్వారా గుర్తించాలని అడిషనల్ డీఆర్‌డీఓ ఆర్. జయశ్రీ సూచించారు. ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో బుధవారం గ్రామ పేదరిక నిర్మూలన ప్రణాళిక (వీపీఆర్‌పీ)పై ఇచ్చిన శిక్షణలో ఆమె మాట్లాడారు. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందేలా వీపీఆర్‌పీ ప్రణాళిక సమగ్రంగా, నిష్పాక్షికంగా రూపొందించాలని ఆదేశించారు. గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవల ప్రతిపాదించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.ఆంజనేయులు, ఏపీఎం పద్మలత, శిక్షకులు కె.వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.


