కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని లింగా ల గ్రామానికి చెందిన చంద్రకళావతి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెన్సెస్ శాఖలో ఉద్యోగం చేస్తున్న ఆమె భూగోళ శాస్త్రంపై పరిశోధనాత్మక గ్రంథాన్ని సమర్పించారు. ఈమేరకు ఓయూ స్నాతకోత్సవంలో చంద్రకళావతికి డాక్టరేట్ అందజేశారు.
కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రామారావు
బోనకల్: తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల సంఘం అధ్యక్షుడిగా మండలంలోని గోవిందా పు రం గ్రామానికి చెందిన జక్కుల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ముగ్ధుం భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో నూతన కమిటీని ఎన్నుకోగా రామారావుకు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ సౌకర్యం, సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేస్తానని తెలిపారు. కాగా, రామారావును సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, నాయకులు పద్మ, దండి సురేష్, కొండపర్తి గోవిందరావు, తోట రామాంజనేయులు, యంగల ఆనందరావు అభినందించారు.
ప్రత్యేక అవసరాల
పిల్లలకు పరికరాలు
బోనకల్: భారత కృత్రిమ అవయవాల తయా రీ కేంద్రం(అలీంకో) ద్వారా ప్రత్యేక అవసరా లు కలిగిన చిన్నారులకు అవసరమైన పరికరా లు అందజేస్తామని జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ బాజోజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బోనకల్ మండలం ముష్టికుంట్లలోని భవిత కేంద్రంలో బుధవారం ఆరు మండలాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన శిబిరాన్ని సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరావు ప్రారంభించగా, వైద్యాధి కారులు కోమల్ నరేష్‌కుమార్, శర్మాన్ పరీక్షలు చేశారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడు తూ మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, వైరా మండలాలకు విద్యార్థులను పరీక్షలు నిర్వహించి వీల్‌చైర్లు, ద్విచక్ర వాహనాలు, బ్రెయిలీ కిట్లు తదితర పరికరాలు కావాల్సిన వారిని గుర్తించామని తెలిపారు.కార్యక్రమంలో ఎంఈఓ దామాల పుల్లయ్య, హెచ్‌ఎం భాగ్యలక్ష్మి, సొసైటీ చైర్మన్ బోయినపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయురాలు పుల్లారాణి తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర
కార్యవర్గంలో జిల్లా నేతలు
ఖమ్మం మామిళ్లగూడెం: కరీంనగర్‌లో ఇటీవల జరిగిన ఏఐటీయూసీ మహాసభల్లో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో జిల్లా నాయకులు పలువురికి స్థానం దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోట రామాంజనేయులు, రాష్ట్ర కార్యదర్శిగా రావి శివరామకృష్ణ ఎన్నిక కాగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గాదె లక్ష్మీనారాయణ, నిమ్మటూరి రామకృష్ణ, పిట్టల మల్లయ్య, చెరుకూరి సీతామాలక్ష్మి, పేరబోయిన మోహన్‌రావు ఎన్నికయ్యారని నాయకులు సింగు నరసింహారావు, కై ్లమెంట్ తెలిపారు. ఈ సందర్భంగా రామాంజనేయులు, శివరామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో కార్మిక ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
అదుపు తప్పి
వాగులో పడిన కారు
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురం సమీపాన నిమ్మవాగులో ఓ కారు పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏన్కూరు మండలం నాచారం గ్రామానికి చెందిన నవీన్ తన కారులో ఏన్కూరు – పల్లిపాడు రోడ్డులో బుధవారం ఖమ్మం వెళ్తుండగా అంజనాపురం నిమ్మవాగు బ్రిడ్జిపై గుంతను తప్పించే క్రమాన కారు అదుపు తప్పింది. ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో కారు బ్రిడ్జి పైనుంచి వాగులో పడింది. అయితే, నీరు తక్కువగా ఉండగా.. స్థానికులు గమనించి స్వల్ప గాయాలైన నవీన్‌ను బయటకు తీశారు. ఆతర్వత క్రేన్ సాయంతో కారును కూడా తీశారు. బ్రిడ్జికి రక్షణ గోడలు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.


