సాంస్కృతిక సారఽథి జిల్లా కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక సారఽథి జిల్లా కమిటీ ఎన్నిక

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

ఖమ్మంగాంధీచౌక్‌: తెలంగా ణ సాంస్కతిక సారథి జిల్లా కమిటీని బుధవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఎన్నుకున్నారు. ఈమేరకు 22 మంది కళా కారులు హాజరై ఓటింగ్‌ ద్వారా కమిటీ ఎన్నుకున్నట్లు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా పాగి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా బొమ్మెర ముత్యం, కోశాధికారిగా చాపలమడుగు కోటేశ్వరరావు విజయం సాధించారు. అలాగే, గౌరవ అధ్యక్షుడిగా మునగాల వెంకటరత్నం, గౌరవ సలహాదారులుగా పమ్మి రవి, సుధాకర్‌, కాల్వకట్ట జాన్‌, మేడ ముత్తయ్య, ఉపాధ్యక్షులుగా పరకాల అజయ్‌, కొమ్ము రమేష్‌, భద్ర, సహాయ కార్యదర్శిగా వెంకట్‌ నకిరేకంటి, చర్ల కృష్ణ, పిడియాల లక్ష్మణ్‌, ప్రచార కార్యదర్శిగా గోవింద గురవయ్య, మహిళా ప్రతినిధులుగా ఎంగల కుమారి, బీరెల్లి రమణ, కొండ్రు జ్యోతి, ముత్తమాల సునీత, కార్యవర్గ సభ్యులుగా బానోత్‌ రవి ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement