జమలాపురం ఆలయంలో పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

జమలాపురం ఆలయంలో పవిత్రోత్సవాలు

Aug 22 2026 12:18 AM | Updated on Aug 22 2026 12:18 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో లోక కల్యాణార్థమై నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో శ్రీవారి కి పంచామృతంతో సర్వాంగాభిషేకం చేశారు. అనంతరం పలు రకాల కూరగాయాలతో అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను శాకంబరీ రూపంలో అర్చకులు అలంకరించి పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవాల ప్రాధాన్యతను ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ భక్తులకు వివరించారు. ఆలయ ఈఓ కె. జగన్మోహన్‌రావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ఉద్యోగులు సోమ య్య, కృష్ణప్రసాద్‌, అర్చకులు పాల్గొన్నారు.

వృత్తి నైపుణ్యాలతో

ఉపాధి అవకాశాలు

భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో కొనసాగుతున్న శిక్షణను శుక్రవారం పీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, ఆసక్తితో బ్యూటీషియన్‌ థెరపిస్ట్‌, ఎంబ్రాయిడరీ శిక్షణలో పాల్గొంటూ జీవనోపాధికి బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, వైడీసీ మేనేజర్‌ శ్రీనివాస్‌, ట్రెయినర్లు పాల్గొన్నారు.

నేడు వైరాలో ఎంప్లాయ్‌మెంట్‌ కార్డుల రిజిస్ట్రేషన్‌

వైరా/ఖమ్మం రాపర్తినగర్‌: నూతన ఎంప్లాయ్‌మెంట్‌ కార్డుల రిజిస్ట్రేషన్‌ కోసం వైరాలో శనివారం శిబిరాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్‌.మాధవి తెలిపారు. ఆన్‌లైన్‌లో ఎంప్లాయ్‌మెంట్‌ కార్డు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉన్నప్పటికీ, యువతకు చేరువ చేయాలనే భావనతో శిబిరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వైరా పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ, యువకులు విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంటర్‌ తర్వాత ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలనే అంశంపై కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దేవరపల్లి టోల్‌ప్లాజా ప్రారంభం

ఖమ్మంరూరల్‌: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వెంకటగిరి వద్ద టోల్‌ ప్లాజా ప్రారంభమైంది. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దివ్య టోల్‌ప్లాజాను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. అధికారికంగా టోల్‌ప్లాజా అందుబాటులోకి వచ్చినందున వైరా మండలం సోమవరం వద్ద వాహనదారులు దిగాల్సిన పని లేకుండా నేరుగా వెళ్లవచ్చని తెలిపారు.

లక్ష్మీదేవిపల్లి

వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

చుంచుపల్లి: హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా శుక్రవారం లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రత్యేక వెబ్‌సైట్‌ అందుబాటులోకి రావడంతో లక్ష్మీదేవిపల్లి ఎంపీడీఓ సుస్మిత స్వయంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని రకాల సేవలు, సమాచారం ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉపసర్పంచ్‌ మహేష్‌, పూనెం శ్రీనివాస్‌ పంచాయతీ కార్యదర్శి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement