కొణిజర్ల: మిర్చి సాగు చేసే రైతులకు నాణ్యమైన నారు సరఫరా చేస్తే మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎం. వీ. మధుసూదన్ తెలిపారు. కొణిజర్ల మండలంలోని పలు నర్సరీలను బుధవారం ఆయన ఆయన తనిఖీ చేశారు. అనంతరం నర్సరీల నిర్వాహకులతో సమావేశమై మాట్లాడుతూ కల్తీని అరికట్టి రైతులకు నాణ్యమైన నారు సరఫరా చేయాలనే లక్ష్యంతో నిత్యం తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. అయితే, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు మిర్చి పునరాలోచన చేసి, నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు ఎంచుకోవాలని సూచించారు. అనంతరం పలు గ్రామాల్లో ఆయిల్‌పామ్ తోటలను కూడా మధుసూదన్ పరిశీలించారు. వైరా డివిజన్ ఉద్యాన అధికారి ఆకుల వేణు, ఆయిల్‌పామ్ విస్తరణాధికారి విశ్వ పాల్గొన్నారు.


