గోసంరక్షణకు రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

గోసంరక్షణకు రూ.లక్ష విరాళం

Aug 20 2026 12:29 AM | Updated on Aug 20 2026 12:29 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన గోసంరక్షణ పథకానికి ఖమ్మంకు చెందిన భక్తులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఖమ్మంకు చెందిన గుంటుపల్లి విశ్వేశ్వరరావు, ఊర్మిళ, కుటుంబ సభ్యులు బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గోసంరక్షణ నిమిత్తం రూ.1,01,116 విరాళాన్ని అధికారులకు అందజేయగా, ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

ముగిసిన

మత్స్య రైతుల శిక్షణ

కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్య రైతులు, మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ బుధవారంతో ముగిశాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌ జిల్లాలకు చెందిన మత్స్యకారులకు బయోఫ్లాక్‌ విధానంలో చేపల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. చివరిరోజు సమావేశంలో కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టక్‌ శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ చేపల పెంపకంలో బయోఫ్లాక్‌ విధా నం అవలంబిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు. అనంతరం యూనియన్‌ బ్యాంక్‌ పాలేరు మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.

ఎఫ్‌బీఓ నవీన్‌

కుటుంబానికి చేయూత

కారేపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ ఉచ్చులకు తగిలి మృతి చెందిన ఎఫ్‌బీఓ బానోతు నవీన్‌కుమార్‌ సంస్మరణ సభ ఆయన స్వగ్రామమైన మండలం వెంకిట్యాతండాలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్‌ భీమానాయక్‌, కొత్తగూడెం, ఖమ్మం డీఎఫ్‌ఓ లు సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌, అనూజ్‌ అగర్వాల్‌, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే, నవీన్‌ కుటుంబానికి తెలంగాణ జూని యర్‌ ఫారెస్టు ఆఫీసర్ల అసోసియేషన్‌ ఖమ్మం, సత్తుపల్లి యూనిట్ల ఆధ్వర్యంలో రూ.46వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ బాధ్యులు, ఉద్యోగులు లకా వత్‌ సురేష్‌, డానియేల్‌, రమేష్‌, కన్నయ్య, గాంధీ, రమేష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

27న మహాధర్నా

జేఏసీ జిల్లా కోచైర్మన్‌ నాగేశ్వరరావు

ఖమ్మం అర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈనెల 27న జిల్లా కేంద్రంలో నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీ జిల్లా కో చైర్మన్‌ పారుపల్లి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ పాఠశాల సముదాయంలో ఆయన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సమావేశమమై మాట్లాడారు. పీఆర్‌సీ అమలు, పెండింగ్‌ డీఏలు, బిల్లుల విడుదల తదితర డిమాండ్లతో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈమేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు హాజరై ఉద్యమాలకు అండగా నిలిచి హక్కులను కాపాడుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సతీష్‌, రంగారావు, శ్యామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అధ్యాపకులకు

ముగిసిన శిక్షణ

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం నయాబజార్‌ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులకు ఇస్తున్న మూడో విడత శిక్షణ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా డీఐఈఓ రవిబాబు మాట్లాడుతూ ‘అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు భవిష్యత్‌ సంసిద్ధ విద్య’ అంశంపై అధ్యాపకులకు వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఏర్పాటుచేశామని తెలిపారు. శిక్షణ, మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకులు బోధనలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమ నోడల్‌ ఆఫీసర్‌గా కళాశాల ప్రిన్సిపాల్‌ ధనమ్మ వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement