● డీఏఓ పుల్లయ్య
వైరా: రైతులు గుళికల రూపంలో యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వినయోగించాలని, వీటిని నేరుగా ఆకులపై స్ప్రే చేయడంతో మొక్కకు నేరుగా నత్రజని చేరుతుందని జిల్లా వ్యవసాయాధికి ధనసరి పుల్లయ్య అన్నారు. పత్తి పంటలో నానో యూరియా, డీఏపీల వాడకంపై మంగళవారం మండలంలోని బ్రాహ్మణపల్లిలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ వెంపటి కీర్తి, మహేందర్‌రెడ్డి, రైతులు సైదులు, నరేష్, గోపి పాల్గొన్నారు.
మిల్లుల్లో
అధికారుల దాడులు
తగ్గిన రూ.2.87 కోట్ల విలువైన ధాన్యం
ముదిగొండ: మండలంలోని అమ్మపేట, వనంవారి కిష్టాపురంలలోని ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ, వెంకటేశ్వర మోడ్రన్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వరంగల్ రీజియన్ విజిలెన్స్ సీఐ రాకేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తనిఖీలు చేపట్టారు. మిల్లులకు సంబంధించిన గోదాముల్లోని ధాన్యం బస్తాలను కౌటింగ్ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరి శీలించారు. వనంవారికిష్టాపురంలోని వెంకటేశ్వర మోడ్రన్ రైస్ మిల్లులో 270మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు, అమ్మపేటలోని శ్రీ వెంకటేశ్వ ర రైస్ ఇండస్ట్రీలో 800 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు తగ్గినట్లు అధికారులు లెక్కలు తేల్చా రు. ఈ రెండు రైస్ మిల్లుల్లోని తక్కువ టన్నుల నిల్వలు రూ.2.87కోట్ల విలువ ఉంటుందని లెక్కతేల్చారు. తనిఖీల్లో వరంగల్ విజిలెన్స్ తహసీల్దార్ లక్ష్మణ్, సీఐ రాకేష్, సివిల్ సప్‌లై డీటీలు నాగలక్ష్మి, విజయ్‌బాబు, టెక్నికల్ అసిస్టెంట్‌లు, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీలు..
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అధికా రులు, సిబ్బంది మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వైరా మండలం అష్ణగుర్తి గ్రామంలో బియ్యం వ్యాపారి బలగాని నర్సింహారావు ఒక ఇంట్లో 9.50 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేయగా..అట్టి రేషన్ బియాన్ని సీజ్ చేసి నర్సింహారావుపై కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు. అదే విధంగా కొణిజర్ల మండలంలోని పలు రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇలా ప్రతి రోజు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎస్‌ఓ మల్లిఖార్జున్‌బాబు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
‘రేషన్’ అక్రమ నిల్వలపై ఉక్కుపాదం
నేటి నుంచి పోలీసులు సైతం రంగంలోకి..
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తున్నందున అర్హులందరికీ రేషన్ బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు అక్రమ రేషన్ బియ్యం నిల్వలు, రవాణా తదితర అంశాలపై సివిల్ సప్లయీస్ అధికారులు తనిఖీలు చేపట్టగా నేటి నుంచి పోలీసులు సైతం నిఘా పెంచనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు.
తహసీల్దార్ల ఆధ్వర్యాన స్మార్ట్‌కార్డుల పంపిణీ
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ల ఆధ్వర్యాన రెవెన్యూ సిబ్బంది సహకారంతో రేషన్ డీలర్లు రెండు, మూడు రోజుల్లో స్మార్ట్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం డీసీఎస్‌ఓ చందన్‌కుమార్ సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 748 రేషన్ దుకాణాలుండగా... వాటి పరిధిలో 4,73,271కార్డులున్నాయి.
చికిత్స పొందుతున్న
ఎలక్ట్రీషియన్ మృతి
కామేపల్లి: విద్యుత్‌షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన షేక్ లాల్ సాహెబ్ (40) రెండున్నర నెలల క్రితం విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి వరంగల్ ఎంజీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూపరిస్థితి విషమించి మృతి చెందాడు.


