కల్యాణలక్ష్మి రద్దుకు ప్రభుత్వం కుట్ర | - | Sakshi
Sakshi News home page

కల్యాణలక్ష్మి రద్దుకు ప్రభుత్వం కుట్ర

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

సత్తుపల్లి: నిరుపేదలకు కన్నీళ్లను తుడిచేందుకు కేసీఆర్‌ మేనమామలా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని, ఏడు వారాల క్రితం ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ మేరకు సత్తుపల్లి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ నుంచి బస్టాండ్‌ రింగ్‌సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తున్న తులం బంగారం ఇవ్వలేదని, ఇప్పటి వరకు ఇచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు పిల్లలు పుట్టిన తర్వాత ఇచ్చిందన్నారు. ప్రభుత్వం కనువిప్పు కలిగించే విధంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టామన్నారు. రూ.100 కోట్లతో చేపట్టిన రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ పనుల లైనింగ్‌ కొట్టుకుపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మీ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, కొత్తూరు ఉమా, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి్‌, వీరపనేని బాబీ, ఎండీ.రఫీ, ఎస్కే చాంద్‌ పాష, అమరవరపు కృష్ణారావు, తడికమళ్ల సాల్మన్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement