ముదిగొండ: గ్రామాల్లో పంటకుంటల నిర్మాణాల్లో రైతుల భాగస్వామ్యం అవసరమని, కుంటల నిర్మాణం వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత అధికారులకు సూచించారు. మండలపరిధిలోని వెంకటాపురంలో పంటకుంటల నిర్మాణం, సోక్‌ఫిట్ నిర్మాణం, డ్రైన్‌ఎండ్, కమ్యూనిటీ సోక్‌ఫిట్, ఇంకుడుగంతల నిర్మాణాలను మంగళవారం ఆమె పరిశీలించారు. మండలంలో మంజూరైన పంటకుంటల నిర్మాణాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటకుంటలు వల్ల భూగర్భజలాలు పెరగడంతోపాటు రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని, రైతులు వ్యవసాయ భూముల్లో పంటకుంటలు నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. వెంకటాపురం పంచాయతీ కార్యాలయంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను పరిశీలించి కార్యదర్శి స్రవంతికి సూచనలు చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయంను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వినోద్, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, డీఎల్‌పీఓ విజయలక్ష్మి, ఏపీడీ శ్రీదేవి, ఎంపీడీఓ విజయ, ఏపీఓ రంగనాయకమ్మ, ఎంపీఓ రామకృష్ట, ఏఓ సరిత, వెంకటాపురం సర్పంచ్ కందుల బాలచందర్ పాల్గొన్నారు.


