పది నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా.. | - | Sakshi
Sakshi News home page

పది నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా..

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

వైరారూరల్‌: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం.. ఆపై తాపీ మేసీ్త్రగా జీవనం సాగిస్తూ ఇంకో పది నిమిషాల్లో ఇంటికి వెళ్తాడనుకునేలోగా రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకానికి చేరాడు. ఎస్సై–2 వెంపటి పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోస్తాల గ్రామానికి చెందిన వేముల భాస్కర్‌ (56) సుతారీ మేసీ్త్రగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ మేరకు పని ముగించుకుని మంగళవారం రాత్రి తన బైక్‌ మీద ఇంటికి వెళ్తుండగా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం ప్రాథమికోన్నత పాఠశాల ఎదురుగా కొండకొడిమ నుంచి వైరా వైపు వస్తున్న దారెల్లి అశోక్‌ బైక్‌ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వేముల భాస్కర్‌కు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికకక్కడే మృతిచెందాడు. దారెల్లి అశోక్‌కు కాళ్లు విరగడంతో 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వాప్పత్రికి తరలించారు. పనిముగించుకుని ఇంటికి వస్తాడనుకున్న భాస్కర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో తాపీమేసీ్త్ర మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement