● అధికారులు ఆలస్యం.. అయినా అధికం | - | Sakshi
Sakshi News home page

● అధికారులు ఆలస్యం.. అయినా అధికం

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

● అధికారులు ఆలస్యం.. అయినా అధికం దూరాభారం తగ్గింది..

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి ఉదయం 10గంటలకు తొమ్మిది శాఖల అధికారులే హాజరయ్యారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, అటవీశాఖ, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు సమయపాలన పాటించలేదు. ఇక సాంఘిక సంక్షేమ అధికారులు తొలిరోజు ప్రజావాణికి హాజరేకాకపోవడం గమనార్హం. ప్రజావాణి సందర్భంగా ఎంపీడీఓ హాల్‌ను అలంకరించారు. ఈమేరకు జిల్లాలో అత్యధికంగా సత్తుపల్లిలో 46దరఖాస్తులు అందగా... ప్రజలకు కుర్చీలు, తాగునీటి సదుపాయం కల్పించారు. అంతేకాక ప్రతీ దరఖాస్తుదారుడితో ఎంపీడీఓ చిన్న నాగేశ్వరరావు మాట్లాడి రశీదులు ఇప్పించడమే కాక లిఖిత పూర్వక సమాధానం పంపిస్తామని వివరించారు. అక్కడికక్కడే దరఖాస్తులనును ఆన్‌లైన్‌ చేయించి సంబంధిత శాఖలకు పంపించారు.

ఇళ్లపై విద్యుత్‌ తీగల సమస్య ఉంది. ఎంతోకాలంగా ఈ సమస్య వేధిస్తున్నా జిల్లా కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయాలంటే దూరం కావడంతో వేచిచూశాం. ఇప్పుడు మండల కేంద్రంలోనే ప్రజావాణి మొదలుపెట్టడం సంతోషంగా ఉంది. మా సమస్య త్వరగా పరిష్కారం అయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎం.డీ.షైనా, కొత్తూరు,

సత్తుపల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement