ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది దానం కాదని, అది సామాజిక బాధ్యత అని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ అన్నారు. పీడీఎస్‌యూ ఖమ్మం, భద్రాద్రి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో కార్యాలయాల వైపు వస్తుండడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నాన తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతున్నా విద్యార్థుల ఫీజు బకాయిల సమస్యపై స్పందించకపోవడం గర్హనీయమన్నారు. ఫలితంగా పలువురు చదువులకు స్వస్తి చెపాల్సి వస్తున్నందున పెండింగ్ ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు టి.లక్ష్మణ్, భద్రాద్రి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర వీరభద్రం, మునిగల శివప్రశాంత్, నాయకులు సురేష్, హరిచంద్రప్రసాద్, రఘు, రామ్‌చరణ్, మురళి, మనోజ్, సుశాంత్, గోపి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పృధ్వీ


