ఫిర్యాదులు పెండింగ్‌ ఉండొద్దు.. | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు పెండింగ్‌ ఉండొద్దు..

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

ఖమ్మం సహకారనగర్‌: ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌ సూచించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఉన్నతాధికారులపైనే ఆశలు..

మండల కేంద్రాల్లో సోమవారం ప్రజావాణి మొదలైనా కలెక్టరేట్‌లో రద్దీ మాత్రం తగ్గలేదు. మండలాల్లో సమస్యల పరిష్కారంపై నమ్మకం లేకపోగా, నేరుగా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే త్వరగా పరిష్కరిస్తారనే భావనతో వచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీల ప్రతినిధులతో సమావేశం

ఓటర్ల ముసాయిదా జాబితా ఆధారంగా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ దివాకర తెలిపారు. అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి సోమవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో 10,85,927 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల చేయగా, ఇందులో అనామలిస్‌ ఓటర్లు, మ్యాపింగ్‌ కాని వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు జిల్లావాసులు పోలింగ్‌ బూత్‌ల్లో జాబితాలు కానీ, ఆన్‌లైన్‌లో కానీ పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, 2026 అక్టోబరు 1 నాటికి 18ఏళ్లు నిండే వారు ఫారమ్‌–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, ఎస్‌డీసీ సదానందం, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు

జిల్లాలో ఎక్కడి తాగునీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ దివాకర తెలిపారు. పాలేరు జలాశయంలో ప్రస్తుతం 17.3 అడుగుల నీటిమట్టం ఉండగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల తాగునీటి అవసరాలకు సుమారు 60 రోజుల పాటు సరిపోతుందని పేర్కొన్నారు. వైరా జలాశయంలో 16.8 అడుగుల నీటిమట్టం ఉండడంతో వైరా, మధిర నియోజకవర్గాలకు 135 రోజుల పాటు సరఫరా చేయొచ్చని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండగా, రానున్న రోజుల్లో వర్షపాతం, ప్రాజెక్టులకు వచ్చే వరద ఆధారంగా సాగునీటిని విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఆయనో ప్రకటనలో వెల్లడించారు.

‘గ్రీవెన్స్‌ డే’లో కలెక్టర్‌ దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement