ఖమ్మంమయూరిసెంటర్: నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాతో పాటు ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని, ఆయన చొరవతోనే నగర అభివృద్ధి సాధ్యమైందని చెందిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులతో కలిసి సోమవారం ఆయన మాట్లాడారు. మంత్రి తుమ్మలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు గర్హనీయమని పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలానికి గోదావరి జలాల సాధన, వ్యవసాయ మార్కెట్ ఆధునీకరణ, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు పనులు తుమ్మల చొరవతోనే సాధ్యమయ్యాయని తెలిపారు. అనంతరం దీపక్‌చౌదరి మాట్లాడుతూ అజయ్‌కుమార్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ సమావేశంలో రాయల నాగేశ్వరరావు, బాలాజీనాయక్, మొక్క శేఖర్‌గౌడ్, దొబ్బల సౌజన్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, గాదే ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ


