అజ్ఞానాన్ని పారదోలే ఆయుధమే విద్య | - | Sakshi
Sakshi News home page

అజ్ఞానాన్ని పారదోలే ఆయుధమే విద్య

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి

నరసింహారావు

ఖమ్మం సహకారనగర్‌: అజ్ఞానాన్ని పార దోలే ఏకై క ఆయుధం విద్య అని.. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి గురువులు, తల్లిదండ్రులను గౌరవించడాన్ని అలవరుచకోవాలని మహాసహస్ర అవధాని గరికపాటి నరసింహారావు సూచించారు. ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో సోమవారం ఓరియంటేషన్‌ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఫోన్లు, టీవీ వంటి వ్యాపకాలు మాని వారంలో రెండో రోజులు డిజిటల్‌ ఉపవాసం అలవర్చుకోవాలని తెలిపారు. తద్వారా చదువుపై దృష్టి సారించొచ్చని చెప్పారు. అంతేకాక గురువులతో చర్చించడంతో ఎలాంటి ఒత్తిడినైనా జయించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన గరికపాటి వారి సందేహాలు నివృత్తి చేశారు. ఆతర్వాత కళాశాల చైర్మన్‌ గుండాల కృష్ణ మాట్లాడుతూ తమ కళాశాలలో ఉన్నత విద్యాప్రమాణాలు పాటిస్తుండడంతో విద్యార్థులు కోర్సులు పూర్తిచేసే లోగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ జి.ధాత్రి, వైస్‌ చైర్మన్‌ శ్రీచైతన్య మాట్లాడగా అకడమిక్‌ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్‌ కుమార్‌, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement