మధిర: మధిరలోని వైరా నదికి రిటైనింగ్ వాల్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మట్టి కోసం నదిలో చేపట్టిన తవ్వకాలు నిలిచిపోయాయి. ఈనెల 19న ‘సాక్షి’లో ‘భట్టి ఇలాఖాలో మట్టి దందా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. భారీగా గుంతలు తవ్వుతుండడంతో రాయపట్నం బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ఈ కథనంలో ప్రస్తావించగా కాంట్రాక్టర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు మట్టి తవ్వకాలు నిలిపివేయడమే కాక, ఇప్పటికే ఏర్పడిన గుంతలను పూడ్చివేయిస్తున్నారు. ఈ విషయమై సోమవారం తహసీల్దార్ రాంబాబు వివరణ కోరగా... కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలు, రవాణా కట్టడికి ఇరిగేషన్, మైనింగ్, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యాన తనిఖీలు చేపడుతామని తెలిపారు.


