రిటైర్డ్‌ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

ఖమ్మం మామిళ్లగూడెం: సహజంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు చూస్తుంటాం! కానీ ఉమ్మడి జిల్లాలో గత పదిహేనేళ్ల సహకార శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదిహేనేళ్ల క్రితం రిటైర్‌ అయిన ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒకే వేదికపై కలుసుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన ఈ సమ్మళనంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన 70 మంది రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొని ఉద్యోగ కాలం నాటి అనుభవాలను పంచుకున్నారు. ఈసమావేశంలో నల్లమల పూర్ణచందర్‌రావు, సుబ్రమణ్య గోపాల్‌, ఈగ పుల్లయ్య, బానోత్‌ వెంకటేశ్వర్లు, బాలసుబ్రహ్మణ్యం, దుగ్గి నర్సింహారావు, దేవులపల్లి శ్యాంసుందర్‌, శీలం అప్పిరెడ్డి, ముత్యాల వీరభద్రం, కాశబోయిన అనంతరాములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement