ప్రతిరోజూ పాఠశాలలోనే అల్పాహారం ఇవ్వనుండడంతో అమ్మానాన్నపై కొంత భారం తగ్గుతుంది. పోషక విలువలు ఉన్న, రుచికరమైన అల్పాహారం పంపిణీ చేయడం సంతోషం. ఈరోజు చట్నీ, రెండేసి మైసూర్ బోండాలు పెట్టారు.
– మంగళపూడి వైష్ణవి,
ప్రాథమిక పాఠశాల, చొప్పకట్లపాలెం
ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం అమలుచేయడం ఆనందంగా ఉంది. మొదటి రోజు మిల్లెట్స్ ఇడ్లీ పెట్టారు. మా స్నేహితులంతా హాజరయ్యారు. పోషకాహారంతో శ్రద్ధగా
చదువుకోవచ్చు. – కూరాకుల లివేక్,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మత్కేపల్లి
అల్పాహారంగా ఇచ్చిన మిల్లెట్స్ ఇడ్లీ రుచిగా ఉంది. ఇలాంటి ఇడ్లీ ఎప్పుడూ తినలేదు. పోషకాలతో కూడిన అల్పాహారంతో ఆరోగ్యంగా ఉంటూ చదువుపై
దృష్టి సారించొచ్చు. అలాగే, అందరూ హాజరయ్యే అవకాశముంది. – సంకెళ్ల స్పందన,
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మత్కేపల్లి


