ఇదే తొలిసారి... | - | Sakshi
Sakshi News home page

ఇదే తొలిసారి...

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

ఇదే తొలిసారి... ఫస్ట్‌ మా నియోజకవర్గంలోనే.. అల్పాహారం.. మాకు వరం

ఇన్నాళ్లు స్కూల్‌ విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. తొలిసారి ఇంటర్‌ విద్యార్ధులకు భోజనం, ఉదయం టిఫిన్‌ పెట్టాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. దీంతో సమయం ఆదా అయి చదువుపై శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది.

– శ్రీరంగం యశ్వంత్‌,

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, బోనకల్‌

ప్రభుత్వం అల్పాహారం పథకాన్ని మా నియోజకవర్గంలోనే మొదటగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. నాణ్యతనే కాక ఎంతో రుచిగా ఉండడంతో అందరం ఇష్టంగా తిన్నాం. ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి గారికి కృతజ్ఞతలు. – అవ్వారి కుందన,

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, బోనకల్‌

కొత్తగా ప్రవేశపెట్టిన అల్పాహారం పథకం మాకెంతో ఉపయోగపడుతుంది. ఇది మా వంటి పేద విద్యార్థులకు వరం లాంటిది. ఈరోజు టిఫిన్‌ రుచికరంగా ఉంది. ఇకపై మరింత ఉత్సాహంగా చదువుకునే అవకాశముంటుంది. – జి.ధనుష్‌,

పదో తరగతి, జెడ్పీహెచ్‌ఎస్‌, ముదిగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement