అల్పాహారం నాణ్యతగానే చాలా రుచిగా ఉంది. పోషక విలువలు కలిగిన టిఫిన్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. కాలేజీలో బ్రేక్‌ఫాస్ట్‌తో తల్లిదండ్రులకు ఉదయాన్నే టిఫిన్ చేసే శ్రమ తగ్గి, ఖర్చు, సమయం ఆదా అవుతుంది.
– ఎన్.హేమలత, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధిర
ఇంటి నుంచి బయలుదేరే సమయానికి టిఫిన్ ఉండదు. ఇప్పుడు కాలేజీలోనే అల్పాహారం అందిస్తున్నారు. పోషక విలువలు కలిగిన టిఫిన్‌తో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. తద్వారా చదువుపై దృష్టి సారించొచ్చు.
– బి.దేవీలాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధిర
మా పాఠశాలకు వచ్చిన అల్పాహారం చాలా రుచిగా ఉంది. ప్రతిరోజూ అల్పాహారం ఇవ్వనుండడం సంతోషంగా ఉంది. పోషకాలు కలిగిన అల్పాహారం వడ్డించాలన్న నిర్ణయం మాలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. – ఊసా శ్యామ్‌కుమార్,
బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల, బనిగండ్లపాడు


