ఏన్కూరు: కుటుంబ వివాదాలతో దంపతులు పోలీసుస్టేషన్‌కు రాగా.. అందరి ముందే భార్యపై కత్తితో భర్త దాడి చేసిన ఘటన ఇది. ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాకు చెందిన భూక్యా రాంబాబు – రజిని దంపతులు కుటుంబ కలహాలతో కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈక్రమాన రజిని బ్యాంక్‌లో పని నిమిత్తం ఏన్కూరు ఎస్‌బీఐ వద్దకు సోమవారం వచ్చింది. ఈ విషయం తెలిసిన రాంబాబు బ్యాంకు వద్దకు చేరుకుని రజినితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆమె పోలీసుస్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తుండగా రాంబాబు కూడా వెనకాలే వెళ్లాడు. స్టేషన్ ఆవరణకు చేరుకుని ఓ పక్కన ఉన్న ఆమైపె కత్తితో దాడి చేశాడు. ఘటనలో రజిని భుజం, చేయిపై గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకుని, రజినిని చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎన్.సంధ్య తెలిపారు.
ఏన్కూరు పోలీసుస్టేషన్ ఆవరణలో ఘటన


