ఎర్రుపాలెం: మండలంలోని వెంకటాపురంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి(శివాలయం) అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన బొగ్గుల మల్లిక సోమవారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్దన్‌రెడ్డికి అందచేయగా ఆయనతో పాటు నాయకులు అభినందించారు. ఈకార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ బొగ్గుల లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు కర్నాటి సుధాకర్‌రెడ్డి, వెర్రు వెంకటేశ్వరరావు, గోపిరెడ్డి, నాగిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎల్‌ఏటీలో మూడో ర్యాంకు
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సోయం పూజిత తమిళనాడులోని నేషనల్ లా యూనివర్సిటీలో సీటు సాధించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సీఎల్‌ఏటీ)లో మూడో ర్యాంకు సాధించిన ఆమె యూనివర్సిటీకి ఎంపికై ంది. పూజిత తండ్రి సోయం నాగేశ్వరరావు ఎల్‌ఐసీ ఉద్యోగి కాగా, ఉపాధ్యాయురాలైన తల్లి సుమలత ప్రో ద్భలంతో సీటు సాధించిన ఆమెను ఆదివాసీ సంఘాల నాయకులు అభినందించారు.
కవి శ్రీనివాసరావుకు
పురస్కారం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంకు చెందిన కవి, రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావుకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టీటీఏ) మహాసభలను అమెరికాలో ఈనెల 17నుంచి 19 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి సాహిత్య ఎక్స్‌లెన్సీ పురస్కార పోటీల్లో కవితల విభాగం నుంచి పాల్గొన్న శ్రీనివాసరావు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఆయనకు సినీ గేయ రచయితలు కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్‌తో పాటు వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ అరుణ సుబ్బారావు, డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, గూడూరు శ్రీనివాస్, రాజశ్రీ పురస్కారం అందజేసి సన్మానించారు.
అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. బీబీఏ, బీసీఏ బీబిఎఫ్‌ఎస్‌ఐ, బయోటెక్నాలజీ, బిజినెస్ అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్, డేటా సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్, గణితం, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్, తెలుగు అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో 50శాతం, ఇతర అభ్యర్థులు 55శాతం మార్కులు సాధించి ఉండాలని, పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈనెల 23వ తేదీ సాయంత్రంలోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పిస్తే, ఈనెల 25వ తేదీన ఇంటర్వ్యూ, డెమో నిర్వహిస్తామని వెల్లడించారు.
మహిళా డిగ్రీ కళాశాలలో...
ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బానోత్ రెడ్డి తెలిపారు. కామర్స్ రెండు పోస్టులు, తెలుగు, ఇంగ్లిష్, చరిత్ర, రాజనీతిశాస్త్రం, కంప్యూటర్స్, గణితం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో 50శాతం, ఇతర అభ్యర్థులు 55శాతం మార్కులు సాధించి ఉండాలని, పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీ సాయంత్రంలోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని, ఇంటర్వ్యూ తేదీ త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.


