ఐఐటీ హైదరాబాద్‌ నుంచి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ హైదరాబాద్‌ నుంచి డాక్టరేట్‌

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

ఖమ్మంరూరల్‌: లక్ష్యసాధనకు పేదరికం అడ్డుకాదని ఏదులాపురానికి చెందిన చేతరాజుపల్లి వీరేందర్‌ నిరూపించాడు. ఆయన ఐఐటీ హైదరాబాద్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్‌ అందుకోగా పలువురు అభినందిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కాంపల్లికి చెందిన చేతరాజుపల్లి యాదగిరి – నాగమణి దంపతులు ఏళ్ల క్రితం ఏదులాపురంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు వీరేందర్‌ కాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదివి 600 మార్కులకు 550 మార్కులతో మండల ప్రథమ స్థానాన నిలిచాడు. ఆతర్వాత రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం పొంది పూర్తిచేశాక గేట్‌ ద్వారా వర్ధమాన్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పీజీ పూర్తి చేశాడు. అనంతరం ఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ ఎస్‌.సూర్యప్రకాష్‌ పర్యవేక్షణలో ‘తక్కువ బరువుతో అధిక సామర్థ్యం కలిగిన ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ నిర్మాణ వ్యవస్థ’పై సమర్పించిన పరిశోధనాత్మత గ్రంధానికి డాక్టరేట్‌ లభించింది. చైన్నెలోని మాడ్యులస్‌ హౌసింగ్‌ సంస్థలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూనే డాక్టరేట్‌ సాధించిన వీరేందర్‌ను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement