తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో ఇటీవల వృద్ధురాలు చెన్న సుగుణ హత్య జరగగా, నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కూసుమంచి సర్కిల్‌తో పాటు ఇతర ప్రాంతాల కు ఎస్‌ఐలు, సిబ్బంది సోమవారం ఉదయం నుంచే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి, గత చరిత్ర వివరాలు సేకరించారు. కూసుమంచి సీఐ సంజీవ్ ఆధ్వర్యాన వివిధ విభాగాల సిబ్బంది తనిఖీల్లో పాల్గొనగా అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే, సాయంత్రం హైదరాబాద్ నుండి వచ్చిన ఫోరెన్సిక్ టీమ్ సభ్యులు హత్య జరిగిన ఇంటిని పరిశీలించారు. అంతేకాక కేసు దర్యాప్తును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు.
హత్య కేసు నిందితుడి కోసం గాలింపు


