రండీ... పోటీపడదాం! | - | Sakshi
Sakshi News home page

రండీ... పోటీపడదాం!

Jul 20 2026 12:32 AM | Updated on Jul 20 2026 12:32 AM

ఐదు గ్రూపులుగా క్విజ్‌

విద్యార్థులకు పర్యావరణంపై

క్విజ్‌ పోటీలు

ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌,

పోటీల నిర్వహణ

జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో

బహుమతులు

రిజిస్ట్రేషన్‌ చేసుకోండి...

ఖమ్మం సహకారనగర్‌: పౌరులంతా భాగస్వామ్యమైతేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే నినాదంతో కేంద్రప్రభుత్వ పరిధిలోని పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ విద్యార్థుల్లో అవగాహన పెంచేలా పోటీల నిర్వహణకు సిద్ధమైంది. తెలంగాణ నేషనల్‌ గ్రీన్‌ కాప్స్‌, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాల, కళాశాలు, పరిశోధన విద్యార్థులకే కాక ఇతరులకు క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు.

అందరికీ సర్టిఫికెట్లు

‘నేషనల్‌ స్టూడెంట్‌ పర్యావరణ్‌ కాంపిటేషన్‌(ఎన్‌ఎస్‌పీసీ) పేరిట విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పర్యావరణంపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, హరిత గృహప్రభావం, సహజ వనరుల వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం, శిలాజ ఇంధనాలు, అడవుల పరిరక్షణ ఆవశ్యకత తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. క్విజ్‌ పోటీలు ఈనెల 15నుంచి మొదలుకాగా సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగుతా యి. పోటీల్లో పాల్గొన్న ప్రతీఒక్కరికి ఈ – సర్టిఫికెట్‌ జారీ అవుతుంది. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 20 తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.

దశల వారీగా బహుమతులు

జిల్లాలో అత్యధిక స్కోర్‌ చేసిన ఐదుగురు విద్యార్థులకే కాక ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చొరవ చూపిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కలెక్టర్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ అందిస్తారు. ఇక రాష్ట్రస్థాయిలో అత్యధిక స్కోర్‌ చేసిన విద్యార్థులు, అత్యధిక సంఖ్యలో పాల్గొన్న జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి అభినందన సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. అలాగే, జాతీయస్థాయిలో అత్యధిక విద్యార్థులు పాల్గొన్న జిల్లా అధికారులకు సన్మానం ఉంటుంది. గతంలో రాష్ట్రంలోని జనగామ జిల్లా జాతీయస్థాయికి ఎంపికై ంది.

గ్రూప్‌ పాల్గొనాల్సిన విద్యార్థులు

01 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు

02 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు

03 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు

04 యూజీ, పీజీ విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్లు

05 ఇతర కేటగిరీల వారు

క్విజ్‌ పోటీల్లో పాల్గొనేందుకు https:// ecomitram. org/ organizationsలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఎక్కువ మంది విద్యార్థులు ఈ పర్యావరణ అవగాహన క్విజ్‌లో పాల్గొనేలా ఉపాధ్యాయులు సహకరించాలి. తద్వారా జిల్లాను ప్రథమ స్థాయిలో నిలపాలి. ఆసక్తి ఉన్న వివరాల కోసం 94404 50141 నంబర్‌లో సంప్రధించవచ్చు.

– ఇనుముల వెంకటేశ్వర్లు,

గ్రీన్‌ కాప్స్‌ కోఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement