‘ఈశా గ్రామోత్సవం’ క్రీడాపోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘ఈశా గ్రామోత్సవం’ క్రీడాపోటీలు ప్రారంభం

Jul 19 2026 12:21 AM | Updated on Jul 19 2026 12:21 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో 18వ ఈశా గ్రామోత్సవం పేరిట నిర్వహిస్తున్న క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈమేరకు తొలిరోజు త్రోబాల్‌ తదిత ర పోటీలు నిర్వహించగా పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పోటీలను జీవీ మాల్‌ అధినేత ఉమామహేశ్వర్‌రావు ప్రాంరభించి మాట్లాడు తూ ఈశా గ్రామోత్సవంలో వయోబేధం లేకుండా మహిళలు ఉత్సాహంగా హాజరుకావడం అభినందనీయమన్నారు. కాగా, పోటీల్లో 84 ఏళ్ల నరసమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా... మ్యూజికల్‌ చైర్స్‌, లెమన్‌–స్పూన్‌, గోనె సంచి పరుగు తదితర పోటీలు నిర్వహించారు. తెలంగాణ, ఏపీలోని 15 జిల్లాల్లో గ్రామస్థాయి పోటీలు జరుగుతుండగా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పూర్తయ్యాక ప్రతీ స్థాయిలో మొదటి నాలుగు స్థానా ల్లో నిలిచిన జట్లకు బహుమతులు అందిస్తారు. ఇక సెప్టెంబర్‌ 6న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఫైనల్స్‌ జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. కాగా, తొలిరోజు త్రోబాల్‌ పోటీలకు 65జట్లు హాజరుకాగా, మూడు కోర్టులు మ్యాచ్‌లు నిర్వహించారు.

డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌

ప్రాసిక్యూషన్స్‌గా ఉపేందర్‌

ఖమ్మం లీగల్‌: ఖమ్మం మహిళా కోర్ట్‌ అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఇటీవల బదిలీపై వచ్చి న రేణిగుంట ఉపేందర్‌ శనివారం విధుల్లో చేరారు. అంతేకాక ఆయనే డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌గా నియమితులవడంతో ఆ బాధ్యతలు కూడా స్వీకరించారు. అంతేకాక కొత్తగూడెం అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా ఫణికుమార్‌, ఖమ్మం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఏపీపీగా పీ.వీ.డీ.లక్ష్మి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఏపీపీలతో డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఉపేందర్‌ సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం పోలీసు కమిషనరసునీల్‌దత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీలు అనిల్‌, కిషన్‌, భద్రయ్య, స్వప్న, ఇందిర, రాజారావు, శ్రీధర్‌ పాల్గొన్నారు.

గంజాయి సేవించిన ముగ్గురి అరెస్ట్‌

ఖమ్మంక్రైం: గంజాయి సేవించిన ముగ్గురు యువకులను శనివారం ఖమ్మం త్రీటౌన్‌ పోలీ సులు అరెస్ట్‌ చేశారు. కరీనంగర్‌కు చెందిన పసు ల సూర్యనారాయణ, కడుసు రాకేష్‌, జగిత్యాల జిల్లా తిప్పన్నపేటకు చెందిన మైదం మల్లేష్‌ ఖమ్మం ప్రకాష్‌నగర్‌ బ్రిడ్జి వద్ద గంజా యి సేవిస్తుండగా పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పరీక్షించగా గంజాయి సేవించినట్లు తేలడంతో కేసు నమో దు చేశామని సీఐ మోహన్‌బాబు తెలిపారు.

హుండీ పగలగొట్టి

నగదు చోరీ

నేలకొండపల్లి: మండలంలోని బైరవునిపల్లి గంగమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దుండగులు శనివారం తెల్లవారుజామున ఆలయ తలు పులను కట్టర్‌తో ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ఆర్వాత హుండీ తీసుకెళ్లి పొలాల్లో ధ్వంసం చేసి నగదు చోరీ చేశారు. ఈమేరకు శనివా రం ఉదయం గుర్తించిన ఆలయ కమిటీ ప్రతి నిధుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలంలో పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, హుండీలో రూ.50వేల నగదు ఉంటుందని కమిటీ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement