రుద్రంపూర్: సింగరేణి సంస్థకు ఇటీవల కేంద్ర బొగ్గుగనుల శాఖ తాడిచర్ల–2 బ్లాక్‌ను కేటాయించింది. ఈ మేరకు కొత్తగూడెంలోని కార్పొరేట్, సెంట్రల్ వర్క్‌షాపుతో పాటు ఏరియాలోని పీవీకే–5, వర్క్‌షాపు, జీకే ఓసీల్లో శనివారం విజయోత్సవాలు నిర్వహించారు. కార్పొరేట్‌లో జరిగిన వేడుకల్లో డైరెక్టర్లు వెంకటేశ్వరు, సూర్యనారాయణ, తిరుమలరావు పాల్గొనగా, కొత్తగూడెం ఏరియాలో జీఎం ఎం.శాలేంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తాడిచర్ల–2 కేటాయింపు సింగరేణి సంస్థ భవిష్యత్‌కు కీలకంగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందేశాన్ని చదివి ప్రతులను ఉద్యోగులకు అందజేశారు. ఆతర్వాత స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, నాయకులు వి.నరసింహారావు, మల్లికార్జున్‌రావు, ఎం.డీ.రజాక్, గోవిందరావు, తిరుపతి, రామకృష్ణ, ముక్కపాటి వెంకటేశ్వర్లు, యోహాన్, రాజారాం, హరీష్, గట్టయ్య, సౌజన్య, సాగర్ తదిరులు పాల్గొన్నారు.
డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసుల్లో 46మందికి జరిమానా
ఖమ్మంక్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 46మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇటీవల తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపర్చగా, రూ.4.60లక్షల జరిమానా విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి నాగలక్ష్మి తీరు చెప్పారని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈక్రమాన ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారులను సీపీ సునీల్‌దత్ అభినందించారని వెల్లడించారు.
కుమారుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు
పాల్వంచరరూల్: తమను ఇంటి నుంచి గెంటివేశాడని తల్లిదండ్రులు కుమారుడిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల ఫరిధిలోని ఇల్లెందులపాడుతండాకు చెందిన భూక్యా మంగ్యా, లక్ష్మి దంపతుల పెద్దకుమారుడు, కేటీపీఎస్‌లో డీఈ ఉద్యోగం చేస్తున్న భూక్యా పుల్యా ఆస్తి విషయమై గొడవపడి శుక్రవారం తల్లిదండ్రులను బయటకు వెళ్లగొట్టి ఇంటికి తాళం వేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
తమ్ముడుపై అన్న..
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని భూక్యా పుల్యా తన సోదరుడు కిషన్‌పై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇద్దరిని ఆదివారం పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


