విద్యుత్‌ ఉద్యోగుల టోర్నీలో విజేతగా ఉమ్మడి జిల్లా జట్టు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల టోర్నీలో విజేతగా ఉమ్మడి జిల్లా జట్టు

Jul 19 2026 12:21 AM | Updated on Jul 19 2026 12:21 AM

ఖమ్మంవ్యవసాయం: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, టీజీ ఎన్పీడీసీఎల్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన ఇంటర్‌ సర్కిల్‌ వాలీబాల్‌, బాల్‌బ్యా డ్మింటన్‌, క్యారమ్స్‌ పోటీలు శనివారం ముగిశాయి. వాలీబాల్‌ పోటీల్లో 20 జట్లు పాల్గొనగా ఫైనల్స్‌లో మహబూబ్‌నగర్‌–ఖమ్మం ఉద్యోగుల జట్లు తలపడ్డా యి. ఇందులో విజేతగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగుల జట్టు నిలిచింది. వరుసగా ఆరోసారి విజేతగా నిలిచి రికార్డు సృష్టించడం విశేషం. జట్టు కెప్టెన్‌గా కొత్తగూడెంకు చెందిన రాజు వ్యవహరించగా, వైస్‌ కెప్టెన్‌గా జి.వెంకటేశ్వర్లు, రామ్‌కుమార్‌(అశ్వారావుపే ట), శివాజీ(దమ్మపేట), యాకూబ్‌(పెనుబల్లి), శివ(మణుగూరు), ప్రశాంత్‌(ఖమ్మం రూరల్‌), సతీష్‌(చండ్రుగొండ) పాల్గొనగా, మేనేజర్‌గా ఖమ్మంకు చెందిన ఉపేందర్‌, కోచ్‌గా జయప్రకాష్‌ వ్యవహరించా రు. జట్టుకు ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్లు టి.మధుసూదన్‌, హెచ్‌ఆర్‌డీ సి.ప్రభాకర్‌ బహుమతులు అందజేశారు.

వాలీబాల్‌లో వరుసగా ఆరోసారి విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement