కామేపల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మాటలతో కాలం గడుపుతోందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ ఆరోపించారు. కామేపల్లి మండలం మద్దులపల్లి, ముచ్చర్లలో శనివారం జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోక ప్రజలు నిరాశలో ఉన్నారని తెలిపారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు ఉండీ అభివృద్ధి చేయకపోగా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాక ప్రాజెక్టుల నిండా నీరు ఉన్నా వదలకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుతో ప్రజలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నందున, రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించిన రవీందర్‌రావు.. అర్హుల ఓట్లు తొలగించకుండా పర్యవేక్షించాలని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు బానోత్ హరిసింగ్‌నాయక్, సామా మోహన్‌రెడ్డి, మల్లెంపాటి శ్రీనివాసరావు, శతకోటి హన్మంతరావు, కాట్రాల రాంబాబు, గడ్డం వెంకటేశ్వర్లు, తూము బాబు, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, పగడాల నాగమణి, జాటోత్ జాయ్‌లూసీ, వడియాల కృష్ణారెడ్డి, మోతుకూరి సీతయ్య, మూడ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు


