ఖమ్మంమయూరిసెంటర్: దేశంలోని యువత విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వారి ఆశలు, ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచనలతో చేపట్టిన ‘ఛాత్రూన్ కి గూంజ్’లో భాగంగా నాయకులు శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం పేపర్ లీకేజీ కారణంగా ఎందరో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారన్నారు. అయినా బాధ్యతగా కేంద్ర మంత్రి విద్యామంత్రి రాజీనామా చేయకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కాగా, దీక్షలో కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, మొక్కా శేఖర్‌గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ హుస్సేన్, విప్లవ కుమార్, కర్నాటి రామారావు, కిలారు అనిల్ కుమార్, బచ్చలకూర నాగరాజు, మూడుముంతల గంగరాజు, దామా స్వరూప, ప్రభావతిరెడ్డి, గాదెల ఝాన్సీ, శ్రీలత, శ్రీనివాస్ యాదవ్, వేల్పుల మురళి, అన్నపూర్ణ, లక్ష్మి తదిరులు పాల్గొన్నారు. వీరికి రాష్ట్ర గిడ్డంగులు, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరితో పాటు పోట్ల నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, గజ్జెల్లి వెంకన్న, వెంకయ్య, సహెలా, రంగా జనార్దన్, వనం ప్రదీప్తచక్రవర్తి, మడుపల్లి భాస్కర్, ప్రతిభారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ


