సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్షకు సంఘీభావం | - | Sakshi
Sakshi News home page

సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్షకు సంఘీభావం

Jul 18 2026 3:35 AM | Updated on Jul 18 2026 3:35 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: పర్యావరణ కార్యకర్త, విద్యా సంస్కర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఖమ్మంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జెడ్పీసెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహంవద్ద పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. లడఖ్‌ హక్కుల సాధన, దేశ భవిష్యత్‌ కోసం వాంగ్‌చుక్‌ చేస్తున్న ఆమరణ దీక్షపై కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ఈ మేరకు అన్నివర్గాలు వాంగ్‌చుక్‌కు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌.తిరుమలరావు, కె.భాస్కర్‌, రవిమారుత్‌, డాక్టర్‌ వై.రవీంద్రనాథ్‌, దేవిరెడ్డివిజయ్‌, డాక్టర్‌ రెహానాబేగం, ఐవీ రమణారావు, డాక్టర్‌ భారవి, డాక్టర్‌ నాగమణి, డాక్టర్‌ ఆనందవాణి, చిర్ర రవి, బుగ్గవీటి సరళ, శేషగిరి, పుల్లయ్య, మోహన్‌ రావు, తిరుమల్‌రావు, స్వర్ణ సుబ్బారావు, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేలకొండపల్లి: పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నేలకొండపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా సమస్యలు పరిష్కరించాలని కోరారు. పౌర సమాజం ప్రతినిధులు పసుమర్తి శ్రీనివాస్‌, కనకం రవికుమార్‌, మారిశెట్టి వెంకటేశ్వరరావు, ఆదాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement